ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. కానీ ఎందుకిలా? నేతలతో వైఎస్ జగన్

1 year ago 42
మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీ మారటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రేపల్లె నియోజకవర్గం వైసీపీ నేతలపై వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ పార్టీ మార్పు వ్యవహారం చర్చకు వచ్చింది. దీంతో మోపిదేవి వెంకటరమణ విషయంలో తాను ఏ రోజు కూడా తప్పు చేయలేదని వైఎస్ జగన్ అన్నారు. మండలిని రద్దు చేసే ఆలోచన వస్తే.. పదవి ఉండదనే కారణంతో ఆయనను రాజ్యసభకు సైతం పంపిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన పార్టీ మారడం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు.
Read Entire Article