సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటి శ్రీరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రీరెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. 41ఏ కింద పోలీసులు శ్రీరెడ్డిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణ సందర్భంగా శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం.