ఆయిల్ కంపెనీలపై చంద్రబాబు సీరియస్.. అనుమతులపై పునరాలోచించాల్సి వస్తుందని వార్నింగ్..

2 hours ago 1
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన విధంగా సరఫరా ఉండాలని.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.
Read Entire Article