అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన జరిగింది. మార్చి 24వ తేదీ నుంచి వీరంతా కనిపించకుండా పోయారు. అయితే విద్యార్థుల కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు ఆచూకీ చెప్తే పదివేలు ఇస్తామని ప్రకటించారు.