Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు ఇళ్లకు చెందిన 6 ఏళ్ల బాలికలపై కన్నేసిన 17 ఏళ్ల ఓ బాలుడు.. వారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలను గదిలోకి తీసుకెళ్లి, ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడగా.. మూడో బాలిక తప్పించుకొని పారిపోయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కులంలోనే పరిష్కరించుకోవాలని పెద్దలు తీర్మానించడంతో విషయం బయటకి రాలేదు.