ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత CBSE చదువు.. నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే..

2 weeks ago 6
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేద విద్యార్థులకు తీపి కబురు. కాగజ్‌నగర్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యాసంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 80 సీట్లకు గానూ అర్హులైన 5వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సీటు సాధించిన వారికి 6 నుండి 12వ తరగతి వరకు ఉచిత సీబీఎస్‌ఈ విద్య, వసతి లభిస్తాయి. ఇందులో 75 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులకు, మూడో వంతు సీట్లు బాలికలకు రిజర్వు చేశారు. విద్యతో పాటు క్రీడలు, ఎన్‌సీసీ, ఐఐటీ కోచింగ్ ఇవ్వనున్నారు.
Read Entire Article