రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 హాస్పిటల్స్ ఉండగా.. ఇందులో 409 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటుగా మొత్తంగా 1,835 వ్యాధులను కూడా చేర్చిన విషయం తెలిసిందే.