Formula e Racing Case Full Details: ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవాహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా చేర్చుతూ.. నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. అయితే.. ఈ కేసుపై స్పందించిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో పూర్తి వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రేసింగ్ వాళ్లు రేవంత్ రెడ్డిని కలిశారని.. మెయిల్స్ కూడా పంపించారంటూ కీలక ఆధారాలను మీడియాకు తెలిపారు.