, School Girls Complaint on RTC Conductor: మారుమూల గ్రామాల నుంచి సూళ్లు, కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలపై ఓ కండక్టర్ తన పైత్యం ప్రదర్శిస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా బూతులు తిడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులో ఫొటో అప్‌డేట్ కాలేదన్న కారణంతో.. బూతులతో రెచ్చిపోవటమే కాకుండా.. బస్సును మధ్యలోనే ఆపేసి దింపేస్తూ.. కర్కషంగా వ్యవహరిస్తున్నాడంటూ కండక్టర్ మీద విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.