చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ప్రమాదం 24 మంది ప్రాణాలు తీసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులకు ఎందుకు ఇన్సూరెన్స్ లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.1 సేఫ్టీ సెస్ ఉన్నా, అది ఎక్స్‌గ్రేషియా నిధికి మాత్రమే వెళ్తుంది. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనలు ఉన్నా.. దీని నుంచి ప్రభుత్వ రవాణా వ్యవస్థలకు మినహాయింపు ఉంది. పరిహారం చెల్లించేందుకు సొంత నిధులు ఏర్పాటు చేస్తున్న కారణంగా మినహాయింపులు ఇస్తున్నారు. అయితే బాధితులకు సకాలంలో పరిహారం అందాలంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో సూచించింది.