ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ పేమెంట్స్.. చిల్లర బాధ తప్పిందంటున్న కండక్టర్లు, ప్రయాణికులు

3 hours ago 1
బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ హమ్మయ్యా అనుకునే వార్త వినిపించింది. బస్సుల్లో యూపీఐ పేమెంట్లు విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే.. ఇప్పటికే ఏసీ, స్లీపర్ బస్సుల్లో ఈ యూపీఐ పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చిన టీజీఎస్ ఆర్టీసీ.. ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో నడిచే సిటీ బస్సుల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో చిల్లర సమస్య తప్పిందని.. టికెట్ ఇవ్వడం కూడా ఈజీ ఉందని కండక్టర్లు చెబుతున్నారు. చేతిలో డబ్బులు లేకున్నా.. ఫోన్ ఉంటే యూపీఐ ద్వారా ప్రయాణం చేసే వీలు ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.
Read Entire Article