మెట్రోతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించే కామన్ పాస్ తీసుకురావాలని నగరవాసులు చాలా కాలంపాటు డిమాండ్ చేశారు. కానీ హైదరాద్ మెట్రో సంస్థ మొదటి నుంచి నెలవారీ పాస్ పట్ల సుముఖంగా లేదు. అయితే గాంధీ జయంతి సందర్భంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ను ప్రవేశపెట్టారు. నెలవారీ పాస్ ధర రూ.8500, డైలీ పాస్ ధర రూ.400గా నిర్ణయించారు. ఈ పాస్ ధర చాలా ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు, నగర వాసులు పెదవి విరిచారు.