హైదరాబాద్ రాయదుర్గం ప్రశాంతి హిల్స్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ టెకీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్నెల్ల క్రితమే తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. క్షణికావేశంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.