శ్రీకాకుళం జిల్లాలోని ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనం ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బులు వసూలు చేసి.. అడిగితే దాడి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ మంత్రి నారా లోకేష్‍కు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవహారంపై నారా లోకేష్ రియాక్టయ్యారు. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.