కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత ఆమె పేరుతో ఫేస్‌బుక్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ వైరల్ అయింది. త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ వస్తుందని.. దాదాపు ముగిసిపోయిందంటూ ఉన్న ఒక పోస్ట్ తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. అది నిజంగానే కొండా సురేఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి వచ్చిందని అందరూ వైరల్ చేశారు. దాంతో ఆ పోస్ట్‌పై నేరుగా కొండా సురేఖనే క్లారిటీ ఇచ్చారు. ఆ పోస్ట్ తాము చేయలేదని.. సోషల్ మీడియా వేదికల్లో తమ పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో గానీ, పోస్టులతో గానీ తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.