Medical Technology: తెలంగాణను బయోడిజైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఓ సదస్సు నిర్వహించారు. దానికి హాజరైన సీఎం ఈ మేరకు పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్ బయోడిజైన్ సమ్మిట్‌లో భాగంగా సీఎం మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా చేయాలన్నారు. దీనికి ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.