ఆస్తి వివాదం, కుటుంబ కలహాలు.. భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!

1 hour ago 1
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్‌ మహారాజ్‌ తండాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం నేపథ్యంలో బానోత్‌ భగవాన్‌ అనే వ్యక్తి భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. ఆస్తి పంపకాల విషయంలో భార్య రాజేశ్వరితో తరచూ గొడవలు జరిగేవని సమాచారం. తాజాగా మరోసారి వివాదం తలెత్తడంతో రాజేశ్వరి భర్తపై దాడి చేసి చెట్టుకు కట్టేసి కొట్టి చంపింది. భగవాన్‌ మృతి అనంతరం రాజేశ్వరి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి విచారమ చేపట్టారు.
Read Entire Article