AP Govt Invites Applications For 271 Liquor Shops: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మిగిలిపోయిన మద్యం షాపులకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 271 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులుసమర్పించవచ్చు. ఈ నెల 21వ తేదీన లాటరీ పద్ధతి ద్వారా అర్హులైనవారికి లైసెన్సులు జారీ చేస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.