Nagarkurnool Govt Hospital: నాగర్ కర్నూల్‌లోని జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక అతిథులు విచ్చేశారు. ఆస్పత్రికి వచ్చిన అతిథులను చూసి.. రోగులు, వారి బంధులు గజగజా వణికిపోయారు. కొందరైతే భయంతో పరుగులు తీశారు. అదేంటీ.. ప్రత్యేక అతిథులొస్తే.. భయపడటమేందుకు.. పరుగులు పెట్టడమేందుకు అనుకుంటున్నారా..? ఎందుకంటే.. వచ్చింది మనుషులు కాదు.. పీక్కలు పీక్కునే వీధి కుక్కలు. కుక్కల గుంపు ఆస్పత్రిలో కలియ తిరుగుతుంటే.. సిబ్బంది కనీసం వాటిని వెళ్లగొట్టకపోవటం గమనార్హం.