విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో జరిగిన రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గురువారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఓ రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. పాపకు పాలు పట్టేందుకు చిన్నారి తల్లి వెళ్లిన సమయంలో.. వెయింటింగ్ హాలులో ఉన్న బాలుడిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాలుడి తల్లి గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు గంటల వ్యవధిలో బాలుడిని గుర్తించారు. కిడ్నాపర్ నుంచి స్వాధీనం చేసుకుని తల్లి ఒడికి చేర్చారు.