రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కల్తీ దందాను అరికట్టడంపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. అక్రమ కట్టడాలపై హైడ్రా.. మత్తు పదార్థాల కట్టడికి ఈగల్ వంటి సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఆహార కల్తీలకు అడ్డుకట్ట వేసేందుకు అలాంటి తరహాలో త్వరలోనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు స్వయంగా సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కల్తీలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఆ సరికొత్త వ్యవస్థకు అధికారాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు.