AP e Panta: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఇ-క్రాప్ నమోదు తప్పనిసరి. ఈక్రమంలో దీనిపై కీలక ప్రకటన చేశారు. ఇకపై అన్నదాతలే స్వయంగా 'APAIMS 2.0' యాప్ ద్వారా ఇ-క్రాప్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసి, MPIN సెట్ చేసుకుని, పొలం ఫోటో తీసి నమోదు చేయాలి. వివరాలు నమోదులో తప్పులుంటే వాటిని సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటు విశిష్ట గుర్తింపు సంఖ్య, పీఎం కిసాన్ నమోదుపై కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.