పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో తల్లిని కోల్పోయిన పదేళ్ల బాలుడు శ్రీతేజ్, మెదడు కణాలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. మాట్లాడలేక.. తినలేక ట్యూబులతో జీవిస్తున్నాడు. నెలకు రూ. 1.25 లక్షల వరకు థెరపీలకు ఖర్చు అవుతున్నాయని.. అల్లు అర్జున్ కుటుంబం చేసిన రూ. 2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ సరిపోవడం లేదని ఆవేదన చెందగా.. నిర్మాత దిల్ రాజు పూర్తి చికిత్సకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.