తెలంగాణలోని 160 ఇంజినీరింగ్ కాలేజీలకు 2025-28 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 33 కాలేజీల్లో ఫీజు లక్ష దాటగా.. 19 కాలేజీల్లో ఫీజులు తగ్గాయి. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగనున్నాయి. ఫీజులు తగ్గిన కాలేజీల్లో అదనంగా చెల్లించిన మొత్తాన్ని విద్యార్థులకు యాజమాన్యాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.