ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచ ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తరగతుల నిర్వహణపై ఇంటర్ బోర్డు ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల బస్‌పాస్‌లను ఆర్టీసీ సిబ్బంది రెన్యువల్ చేయలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్‌పాస్‌లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది.