ఇంటర్వెల్, లంచ్ మాత్రమే కాదు, స్కూళ్లల్లో మరో బ్రేక్ కూడా.. చంద్రబాబు ఆదేశాలు

11 months ago 11
Water Bells in AP Govt Schools: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఇంటర్‌వెల్, లంచ్ బ్రేక్ మాత్రమే కాదు.. అదనంగా మరో బ్రేక్ రానుంది. మరోసారి బెల్ మోగనుంది. అదే వాటర్ బెల్. వేసవి కాలం నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. వేసవికాలం సన్నద్ధతపై చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
Read Entire Article