మీసేవ ద్వారా 150 రకాల పౌరసేవలను తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా ‘మొబైల్ యాప్’ సిద్ధం చేసింది. మీసేవ యాప్ పేరుతో యాప్ సిద్ధం కాగా.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ప్రారంభించనున్నారు. రద్దీ ప్రాంతాల్లో కియోస్క్‌లు సైతం ఏర్పాటు చేయనున్నారు.