లెర్నర్ లైసెన్స్ పరీక్షను ఇంటి నుంచే రాసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రవాణాశాఖ సిద్ధమవుతోంది. అందుకు సారథి న్యూ లెర్నర్ లైసెన్స్ పరీక్ష వ్యవస్థతో పాటు ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగించనున్నారు. అభ్యర్థి గుర్తింపు, పరీక్ష సమయంలో కదలికలు, మాల్‌ప్రాక్టీస్‌ను సాంకేతికంగా పర్యవేక్షిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే క్యూఆర్ కోడ్ ఆధారిత ఎల్‌ఎల్‌ఆర్ జారీ చేయనున్నారు. ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే వారం రోజుల్లోనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.