Narsampet: హోటల్ అంటే.. కస్టమర్లను ఆకర్షించేలా బయట భారీ హోర్డింగులు, లైటింగ్, డెకరేషన్.. ఇక లోపల ఆకర్షణీయంగా టేబుళ్లు, కుర్చీలు, లైట్ మ్యూజిక్‌తో ఆహ్లాదమైన యాంబియన్స్.. రకరకాల వంటకాల లిస్ట్‌తో మెనూ కార్డు.. ఇవన్నీ కనిపిస్తాయి. కానీ.. అలాంటివేవీ లేకుండా కేవలం చిన్న ఇంట్లో.. కుటుంబసభ్యులే వర్కర్లుగా మారి.. స్వయంగా వండి, తక్కువ ధరలకే ఇంటి భోజనాన్ని గుర్తు చేస్తున్నారంటే నమ్ముతారా. నమ్మాల్సిందే.. ఎందుకంటే.. ఆ హోటల్‌కే ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి అవార్డు కూడా వచ్చింది. అదే.. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఉప్పలయ్య హోటల్.