ఇంటింటికి బొట్టు పెట్టి గ్రామంలోని ప్రతీ మహిళకు చీరలు పంపిణీ.. ఇది పథకం కాదండోయ్..

3 months ago 9
యాదాద్రి భువనగిరి జిల్లా, సీతారాంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాధవి , మాధవ రెడ్డి దంపతులు.. తమ కుమారుడి పెళ్లి ఆహ్వానంలో ఆత్మీయతను చాటుకున్నారు. ఈ రోజుల్లో వాట్సాప్‌ ఆహ్వానాలకు భిన్నంగా, ఈ దంపతులు ఊరిలోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, బొట్టు పెట్టి శుభలేఖతో పాటు చీరను కూడా అందించారు. తమ చిన్న కుమారుడు వరుణ్ రెడ్డి వివాహానికి (ఈ నెల 23న) గ్రామ ప్రజలందరూ హాజరు కావాలని ఆప్యాయంగా ఆహ్వానించారు. గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విందు ఏర్పాటు చేశారు. ఈ దంపతుల అరుదైన ఆహ్వాన పద్ధతి గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతోంది.
Read Entire Article