హైదరాబాద్ నగరంలోని వరద, మురుగు నీటి నాలాలు పాత పరుపులు, సోఫాలు, దిండ్లు వంటి గృహోపకరణ వ్యర్థాలతో పూడిపోకుండా జీహెచ్‌ఎంసీ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఇంటి నుంచే పాత వస్తువులను, ఈ-వేస్ట్‌ను సేకరించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలోని ప్రజలు జీహెచ్‌ఎంసీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్ లింక్ ద్వారా తమ ఇంటి లొకేషన్‌ను షేర్ చేయటం ద్వారా ఈ ఉచిత వాహన సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు.