ఇంట్లో 16 తులాల బంగారం ఉన్నా దొంగలు దోచుకోలేకపోయారు.. యజమానిది ఏం తెలివి గురూ..!

2 months ago 12
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇంట్లో బంగారం, భారీగా క్యాష్ ఉన్నా.. దొంగలు దోచుకోలేకపోయారు. అద్రాస్‌పల్లికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్ కుటుంబం శిర్డీ వెళ్తూ.. తమ ఇంట్లోని 16 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదును బీరువాలో కాకుండా ఇంట్లోనే రహస్య ప్రదేశాల్లో దాచారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టినా వారికి కేవలం రూ. 30 వేలే దొరికాయి. యజమాని సమయస్ఫూర్తి వల్ల భారీ నష్టం తప్పగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article