భారతదేశంలో రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల్లో భాగంగా బెంగళూరు-హైదరాబాద్, పుణె-హైదరాబాద్, హైదరాబాద్ చెన్నై రూట్లు ఖరారైనట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటితో పాటు ముంబై-అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది నాటికి మొదటి సెక్షన్ అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. బిహార్ వంటి రాష్ట్రాలలో రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.