విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణిని బంధించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు చోరీ చేశారు. ఈ ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గర్భిణ ఒంటరిగా ఉండటం గమనించిన ఓ ఆగంతకురాలు ఈ చోరీకి పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలు ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.