ఇంట్లో మర్డర్ జరిగితే పర్సనలా.. జగన్‌ది సిక్ మైండ్ సెట్: వైఎస్ షర్మిల

1 month ago 5
తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరన్నారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల. తనతో వారికి వ్యక్తిగత విభేదాలు (పర్సనల్‌ ఇష్యూస్‌) ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని.. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారన్నారు. బాబాయి హత్య జరిగితే అది పర్సనలా అంటూ ప్రశ్నించారు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు ఉందన్నారు. అందుకే తాను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారన్నారు. గత పాలనలో ఐదేళ్లూ రాష్ట్రం మొత్తాన్ని దోచేశారని.. రుషికొండలో కొండ లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి గురించి, మద్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది తన వ్యక్తిగతమా? అన్నారు. తాను నిజాలు మాట్లాడితే సోషల్‌ మీడియాలో సైతాన్‌ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్‌ ఎలా అవుతాయో వైఎస్సార్‌సీపీ నేతలే చెప్పాలన్నారు. సెకి ఒప్పందాలపై మేం వితండవాదం చేయాల్సిన అవసరం లేదని.. వారు తప్పు చేశారు కనుకే భయపడుతున్నారన్నారు.
Read Entire Article