జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు పథకాలను లాంచనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ప్రారంభించారు. నిన్న ప్రారంభించారో లేదో.. నేడు హైకోర్టులో ఈ పథకంపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ తరపు వాదనలు విని.. తెలంగాణ సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.