ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు సరిపోవట్లేదు, రూ.15 లక్షలు కావాల్సి వస్తోంది: రాజగోపాల్ రెడ్డి

1 month ago 9
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం సరిపోవడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు పెరగడంతో ఇల్లు నిర్మించేందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతోందని తెలిపారు. డబ్బులు లేక కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించలేకపోతున్నారని.. మరికొందరు బంగారం కుదవపెట్టి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. అందువల్ల ఇందిరమ్మ ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Entire Article