ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు చేశారు. ఇప్పటి వరకు ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయని చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలను ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేయాలని ప్రతి 500 ఇండ్లకు ఒక సర్వేయర్‌ను కేటాయించాలని సూచించారు.