ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణం కోసం ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గనులు, ఖనీజాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇసుక మాఫియాను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు చేశారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.