ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా పథకం అమలులో ఏఐ టెక్నాలజీని అమలు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే పథకాలు అందేలా ఏఐ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు.