తెలంగాణలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 8 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని ఎల్-2 (స్థలాలు లేని వారు) లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి లబ్ధిదారుల కమిటీల ద్వారా నిర్మాణాలను పూర్తి చేయించనున్నారు. ఏ దశలో ఉన్న ఇళ్లనైనా లబ్ధిదారులకు అప్పగించి మిగిలిన పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.