తెలంగాణలో జనవరి 26న రేవంత్ రెడ్డి ప్రారంభించిన పథకాల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఒకటి. అయితే.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. కాగా.. మొదటి దశలో స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల లిస్ట్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఇసుక విధానంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.