ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ. 202.93 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వారం 18,247 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని.. మొత్తం రూ. 2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తమ ఇళ్ల నిర్మాణం కోసం నిధులు అందిన లబ్ధిదారులు వెంటనే బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకుని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులు సూచించారు.