ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎంఏవై కింద ప్రత్యేక నిధులు రానున్నాయి. పట్టణాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు, గ్రామాల్లో అయితే రూ.72 వేల చొప్పున కేంద్రం వాటా అందించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.13 లక్షల ఇళ్లకు ఈ ప్రత్యేక నిధులు అందే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.