ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తులు.. యాప్‌, ఆన్‌లైన్‌‌లో నమోదు.. సీఎస్ కీలక ఆదేశాలు

3 hours ago 2
తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడిని ఈ పథకంలో నమోదు చేయాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సుమారు నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం నేతన్నలు, గౌడ, కార్మిక, మత్స్యకారులకు అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచి, వివిధ బీమా పథకాలను ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకురానున్నారు.
Read Entire Article