తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు.. 10 రోజుల్లో 8.34 లక్షల మందికి అవకాశం!

3 hours ago 2
తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈసారి 10 రోజుల్లో 8.34 లక్షల మంది భక్తులకు అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి 2 రోజులు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల ద్వారా దర్శనం కల్పించి.. తర్వాతి 8 రోజులు సర్వదర్శనం అమలు చేయనున్నారు. అలిపిరి సమీపంలో రూ.2,750 కోట్లతో యాత్రికుల టౌన్‌షిప్ నిర్మాణానికి డీపీఆర్, డిజైన్ల తయారీ కోసం కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, తిరుమల పారిశుద్ధ్యానికి 348 మంది సిబ్బంది నియామకం, 500 దేశీయ గోవుల కొనుగోలుకు రూ.7.50 కోట్లు, స్విమ్స్‌కు రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు తదితర నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కూడా నిర్ణయాలు తీసుకున్నారు.
Read Entire Article