తన భార్య తరచూ గొడవలు పడుతూ, తిడుతూ, కొడుతూ వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. నాకు బతకాలని లేదని.. తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండండి అంటూ ఆ వీడియోను పంపించి అదృశ్యం అయ్యాడు. స్కూటీ దొరకగా.. అతడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.