ఇందిరమ్మ బీమా వచ్చే వరకు రైతుబీమా కొనసాగింపు.. ప్రభుత్వం ముందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు

54 minutes ago 1
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమల్లోకి వచ్చే వరకు రైతుబీమా పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. 18 నుంచి 59 ఏళ్ల రైతులు మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.5 లక్షలు అందించే రైతుబీమా గత నెల 13తో నిలిచిపోయింది. 2026-27కు ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ తర్వాత మరణించిన రైతుల కుటుంబాలకు సాయం అందడం లేదు. ఈ సమస్యపై రైతు కుటుంబాల వినతుల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశమయ్యారు. ఆయన సూచనల మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సీఎం కార్యాలయం, ఆర్థికశాఖకు పంపింది.
Read Entire Article