బెజవాడలోని ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఒక్కోసారి దర్శనాలకు ఐదారుగంటలు కూడా పడుతోంది. రద్దీని నియంత్రించడానికి అధికారులు నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కొండపైనే శాశ్వత కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. మహామండపంలోని నాలుగో అంతస్తులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సీసీటీవీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాలను పర్యవేక్షించనున్నారు. దీని ద్వారా భక్తుల రద్దీని నియంత్రించి, సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది.