వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మొక్కజొన్న పంటకు రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.2310 ధర లభించింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కు సమానంగా ప్రైవేటు వ్యాపారులు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన రైతు మామిండ్ల దేవేందర్ తన రెండెకరాల్లో పండించిన 72 క్వింటాళ్ల మొక్కజొన్నను ఈ ధరకు విక్రయించి భారీ లాభాలు గడించారు. ప్రభుత్వ మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో కొనుగోళ్ల జాప్యం కారణంగా పంటను ఇంట్లోనే నిల్వ ఉంచిన రైతుకు.. ఓపెన్ మార్కెట్లో ఈ ఊహించని భారీ ధర లభించడంతో హర్షం వ్యక్తమవుతోంది.